గుంటూరులో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడిచేసిన వైసీపీ శ్రేణులు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెంలో వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఓ అంగన్ వాడీ కేంద్రానికి సంబంధించి టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వైసీపీ మద్దతుదారులు టీడీపీ కార్యకర్త షేక్ అల్లావుద్దీన్ పై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన కుడిచేతికి తీవ్రగాయం అయింది. దీంతో ఆ గాయంతోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన అల్లావుద్దీన్ ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఘటన అనంతరం పరారయ్యారు. దీంతో కేసు నమోదుచేసిన మాచవరం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Guntur District
Telugudesam
YSRCP
swords
fight
attacked
Police

More Telugu News